About

 ప్రవచనాత్మక ప్రకటన అంటే ఏమిటి? దయచేసి గమనించండి , ఇది ఒక మాయా మాత్ర కాదు, ఇక్కడ క్షణాల్లో ధనవంతులయ్యే ఫార్ములాను పొందండం, సాకులు చెప్పటం లేదా బద్ధకానికి చోటు లేదు.

ఇది యేసయ్యతో సాన్నిహిత్యం కలిగి ఉండడం ద్వార పుట్టేది,  మరియు జీవితంలోని అన్ని కాలలలో(సందర్బాలలో) యేసయ్య స్వరాన్ని మరియు ఆయన వచనాలను వింటూ వెళ్ళడం. దేవుడు మనల్ని విఫలం కాకుండా విజయవంతం కావాలని నిర్దేశించాడు. ఆయన పరిచారకునికి ఎంతో ప్రముఖ్యతను ఇచ్చాడు మరియు ఆయన వాక్యము మనము ప్రవచన ప్రపంచంలో జీవించాలని చెపుతుంది. మనం యేసయ్యతో నడుస్తూ ఉన్నపుడు, పరలోక రాజ్యంలో ప్రతికూలత, అనారోగ్యం లేదా నిస్సహాయత ఉండదు.

ప్రవచనాత్మక ప్రకటనలు అంటే పరలోక సింహాసనం గదిలో మనం ఏమి చూస్తామో మన నోరు తెరిచి, దేవుడు మన కోసం ఏమి నిల్వ ఉంచాడో ప్రకటించగల సామర్థ్యం. ఇది బైబిల్ అనుసారమైనదనే సత్యమును తెలుసుకోవడానికి మేము దేవుని వాక్యాన్ని సూచిస్తాము. ఆదియందు ప్రపంచం దేవుని వాక్యం ద్వారా సృష్టించబడింది మరియు యేసు ఆ వాక్యమై యున్నాడు.

యేసయ్యతో నడవడం మరియు ఈ ప్రకటనలను ఉచ్చరించడం ద్వారా ప్రవచనాత్మక రంగానికి మనము తీసుకువెళ్ళబడతాము .

ప్రవచనాత్మక ప్రపంచం యొక్క లేఖనాత్మక సూచనలు ఎందుకంటే యేసు రాజుల రాజు మరియు ఆయన వాక్యం పరలోకంలోను, భూమిపై మరియు ఆయన ప్రేమను ,ఆయన సాన్నిహిత్యాన్ని, ఆయనకు చోటిచ్చి మరియు ఆయనతో సహా భాగస్వామియైన ఆయన ప్రియమైన సృష్టి యొక్క హృదయాలపై అధికారాన్ని కలిగి ఉంది.

ప్రకటన 19:16

రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.

యెషయా 55: 10-11 

10 “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును

11 నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.” 

ఆయన మనలను రాజులైన యాజక సమూహముగా చేసాడు మరియు మనము యేసయ్యతో సన్నిహిత సంబందం కలిగి ఉండడం ద్వారా ఆ అధికారాన్ని మరియు అభిషేకాన్ని నిర్వహిస్తాము. ఆయన స్వరాన్ని వింటూ, ఆయన హృదయం మరియు ఆయన ప్రేమ యొక్క స్వరాన్ని వింటూ ఆయన ప్రామాణికమైన ప్రత్యక్షతతోమనము  నిండినప్పుడు, ఆయన సన్నిధిని, శక్తిని, అధికారాన్ని, సంకల్పాన్ని మరియు ఉద్దేశ్యాలను ఈ భూమిపై  ప్రదర్శించగలము.

ఆదికాండము 1:28 (వివరణ)

మరియు దేవుడు వారిని ఆశీర్వదించాడు [వారికి కొంత అధికారం ఇస్తూ] మరియు వారితో ఇలా అన్నాడు, “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; [మన శక్తి కింద వాటిని పెట్టడం ]; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని [ఆధిపత్యం]. ”

1 పేతురు 2 : 9 

9 “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.”

ఈ ఒప్పుకోలు మన జీవితాల కొరకు దేవుని (యేసు) ప్రామాణికమైన ప్రణాళికను అమలు చేయడం, అనగా ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుచు; భూమిపై పరలోకాన్ని తీసుకువచ్చే ప్రేమలో ఆధిపత్యం మరియు పాలన కలిగి ఉండటం.